కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆళ్లగడ్డ పరిధిలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నెల 10, 11 తేదీల్లో వరసగా సగటున 50 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో నియోజకవర్గ పరిధిలోని ఒక్కిలేరువాగు, రాళ్లవాగు ,నల్ల వాగుల్లో నీటి ప్రవాహం పెరిగింది. చాగలమర్రి పరిధిలో ఒక్కిలేరు ఉధృతంగా ప్రవహించడంతో.. సమీపంలోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే మంచి వర్షాలు కురవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనులు కొనసాగించేందుకు ఈ వర్షం ఎంతో సహాయపడుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: బ్రిటన్, స్పెయిన్లను వెనక్కి నెట్టి నాలుగో స్థానంలోకి..