ETV Bharat / state

bus facility: పార్వతి పాడింది...'పల్లె వెలుగు' వచ్చింది - Government provided bus facility to Lakkasagaram kurnool district

bus facility: పల్లె కోయిల పాటకు పల్లె వెలుగు బస్సు కదిలొచ్చింది. కొన్నేళ్లుగా ఆ కుగ్రామం ఎదుర్కొంటున్న రవాణా కష్టాలకు తెరదించింది. ఊరంతా వెన్నెల అనే గీతంతో ఊరంతా ఆనందం నింపిన ఆమె పాట ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం.

పార్వతీ
పార్వతీ
author img

By

Published : Feb 22, 2022, 6:57 PM IST

bus facility: కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలం లక్కసాగరానికి చెందిన పార్వతి.. ఓ టీవీ కార్యక్రమంలో పాటలపోటీలో పాల్గొంది. రంగ్‌దే సినిమాలోని "ఊరంతా వెన్నెల మనసంతా చీకటి " అనే పాట పాడింది. పార్వత్రి గానామృతానికి, ముగ్దులైన న్యాయ నిర్ణేతలు ఏంకావాలో కోరుకోమని ఆ పల్లెకోయిలమ్మను ఆడిగారు. ఊరి కష్టమే తన కష్టంగా భావించిన పార్వతి మా ఊరికో బస్సుంటే చాలు సార్‌.. అంతకుమించి నాకేమీవద్దని.. వేదికపైనే చెప్పేసింది. సీన్‌ కట్‌చేస్తే.. పార్వతి స్వగ్రామంలో పల్లెవెలుగు బస్సుకు రిబ్బన్‌ కటింగ్‌ జరిగింది.

లక్కసాగరానికి బస్సు సదుపాయం కల్పించిన ప్రభుత్వం

లక్కసాగరం నుంచి హైస్కూల్‌కుగాని, కళాశాలకుగానీ వెళ్లాలంటే 25 కిలోమీటర్ల దూరంలోని డోన్‌కి వెళ్లాలి. రోడ్లు అద్వానంగా ఉన్నాయని బస్సులు తిప్పడం మానేశారు. తిరుపతిలో చదువుకున్న పార్వతి ఆ సమయంలో సమయానికి రైలు అందుకోలేక ఇబ్బంది పడిన సందర్భాలు గుర్తుచేసుకుంది. ఒక్కోసారి రైల్వే స్టేషన్‌లోనే నిద్రించి మరుసటి రోజు వెళ్లిన సందర్భాలూ ఉన్నాయని తెలిపింది. ఆ కష్టాలు మరెవరూ పడకూడదనుకున్న పార్వతి.. ఊరికి బస్సు సౌకర్యం కావాలని కోరుకుంది. ఈ వీడియో వైరలై రవాణాశాఖ మంత్రి పేర్నినానికి చేరింది. ఆ వెంటనే ఆర్టీసీ అధికారులకు ఆదేశాలివ్వడంతో ఊరికి బస్సు వచ్చేసింది. పండగ వాతావరణంలో.. డోన్‌ నుంచి లక్కసాగరానికి బస్సు సర్వీస్‌ మొదలైంది. ప్రముఖ గాయని స్మిత బస్సును ప్రారంభించారు. పార్వతిని అభినందించారు. పార్వతితోపాటు బస్సులో కొంద దూరం ప్రయాణించిన గ్రామస్థులు ఇది పల్లెకోయిల తెచ్చిన పల్లెవెలుగు బస్సంటూ సంబరపడిపోయారు.

ఇదీ చదవండి: బజరంగ్​ దళ్ కార్యకర్త హత్యపై దర్యాప్తు ముమ్మరం- ఆరుగురు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.