ఏపీ ఎన్జీవో సంఘం నాయకులు ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని మరచి రాజకీయ పార్టీల వైపు మొగ్గుచూపుతున్నారని కర్నూల్లో ఆరోపించారు. అశోక్బాబు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండి ఎమ్మెల్సీ పదవిని చేపట్టారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆయన ఎమ్మెల్సీని రద్దు చేయాలని కోరారు.
ఇవీ చదవండి: పరిహారం అందక.. బతుకు సాగక... రైతు జీవితం కుదేలు!