కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని హెచ్‌బీఎస్ కాలనీలో చోరీ జరిగింది. వేణుగోపాల్ ఆచారీ అనే వ్యక్తి ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలోని 21 తులాల బంగారం అపహరించుకెళ్లారు. ఇటీవల వారు ఇంటికి తాళం వేసి వేరే ఊరు వెళ్లారు. ఆయన భార్య తిరిగి ఇంటికి వచ్చి చూడగా బీరువాలోని నగలు మాయమయ్యాయి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా...వారు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్‌టీం సహకారంతో వివరాలు సేకరిస్తున్నారు. చోరికి గురైన బంగారం విలువ పది లక్షలు ఉంటుందని బాధితులు వెల్లడించారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ..21 తులాల బంగారం అపహరణ ! - తాళం వేసిన ఇంట్లో చోరీ..21 తులాల బంగారం అపహరణ !
తాళం వేసిన ఇంట్లో చోరికి పాల్పడి 21 తులాల బంగారం అపహరించిన ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
![తాళం వేసిన ఇంట్లో చోరీ..21 తులాల బంగారం అపహరణ ! తాళం వేసిన ఇంట్లో చోరీ..21 తులాల బంగారం అపహరణ !](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7786651-898-7786651-1593193052124.jpg?imwidth=3840)