![gandhi image drawn](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-knl-24-27-pratibha-art-abb-ap10058_27122020220222_2712f_02741_1061.jpg)
కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన నిత్య అనే అమ్మాయి గీసిన చిత్రానికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు, హైరేంజ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కింది. 2020 అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని.. 621 సూక్ష్మ గాంధీ చిత్రాలతో జాతిపిత చిత్రాన్ని గీయడం ఇందులో ప్రత్యేకత.
ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న నిత్య.. 13 అంగుళాల పొడువు, 4 అంగుళాల వెడల్పు గల డ్రాయింగ్ చార్టుపై మైక్రో పెన్నుతో కేవలం రెండు గంటల వ్యవధిలోనే చిత్రాన్ని పూర్తి చేసింది. దీనికి సంబంధించి తగిన ఆధారాలతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డు, హై రేంజ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్‌లకు పంపగా.. ఎంపికైనట్లు మెడల్స్, ప్రశంస పత్రాలు పంపించారు. వాటిని కొటేష్ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ కొటేష్.. నిత్యకు అందజేసి సన్మానించి అభినందించారు. తాను వేసిన చిత్రానికి గుర్తింపు రావడం ఆనందంగా ఉందంటూ చిత్రకారిణి హర్షం వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి: గాడిద పాల వ్యాపారం.. రోజుకు రూ.రెండు వేలు ఆదాయం