కర్నూలు జిల్లా నంద్యాలలో బ్యాంకు కోచింగ్ కోసం వచ్చిన విద్యార్థులకు భోజన వసతి కల్పించేందుకు దాతలు ముందుకొచ్చారు. ఆరో కన్స్ట్రక్షన్ లిమిటెడ్ భోజనాన్ని, సర్వనీడ్ సంస్థ అల్పాహారం అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి ప్రారంభించారు. బ్యాంకు పరీక్షల శిక్షణ కోసం వచ్చిన కర్ణాటక, తెలంగాణ విద్యార్థులు నంద్యాలలో అధికంగా ఉన్నారు. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారికి భోజనం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఇదీచూడండి. పాణ్యంలో అన్నదానం... దాతల సహాయం