కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. జలాశయం ఇన్‌ఫ్లో 1,27,417 క్యూసెక్కులుగా ఉండగా...ఔట్‌ఫ్లో 62,076 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయ గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు... కాగా ప్రస్తుత నీటిమట్టం 884.10 అడుగులకు చేరింది. జలాశయంలో గరిష్ఠ నీటినిల్వ 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటినిల్వ 210.5133 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది.
ఇదీ చదవండి