కర్నూలు విమానాశ్రయం నుంచి మూడు నగరాలకు విమాన సేవలు ప్రారంభించనున్నట్లు ఇండిగో సంస్థ తెలిపింది. మార్చి 28 నుంచి ఈ స్వరీసులు ప్రారంభం కానున్నట్లు స్పష్టం చేసింది. ఉడాన్ పథకం కింద కర్నూలు నుంచి బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై నగరాలకు విమాన సర్వీసులు నడపనున్నట్లు వెల్లడించింది. బెంగళూరు- కర్నూలు, విశాఖపట్నం-కర్నూలు, చెన్నై- కర్నూలు.. ఈ మూడు మార్గాల్లో వారానికి నాలుగుసార్లు విమాన సేవలు ఉంటాయి.
"ఈ నిర్ణయంతో భారతదేశంలో ప్రాంతీయ కనెక్టివిటీని వ్యూహాత్మకంగా మెరుగుపరుస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని మూడు రాజధానులలో కర్నూలు ఒకటి. అలాగే రాబోయే హైదరాబాద్-బెంగళూరు ప్రారిశ్రామిక నడవలో కీలకమైన ప్రాంతం. ఈ విమాన సేవల ద్వారా ప్రభుత్వం అధికారులకు, పర్యాటకులకు మేలు జరుగుతుంది."- ఇండిగో చీఫ్ స్ట్రాటజీ అండ్ రెవెన్యూ అధికారి సంజయ్ కుమార్
ఇదీ చదవండి: ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి సజ్జలను తప్పించాలని గవర్నర్కు ఎస్‌ఈసీ లేఖ