క్రికెట్ బెట్టింగ్‌కు సంబంధించి ఐదుగురు వ్యక్తులను కర్నూలు జిల్లా నంద్యాలలో పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ.9.40 లక్షల నగదు, రూ.4 లక్షలు విలువైన రెండు చెక్కులు, ఒక ద్విచక్రవాహనం, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.. బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో అక్కడకు చేరుకున్న రెండో పట్టణ పోలీసులు వారిని పట్టుకున్నారు. అబోతు నీరజ్, నరేంద్ర చౌదరి, కృష్ణ వంశీ, సమ్మద్ బాష, గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తులను అరెస్టు చేయగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు నంద్యాల డీఎస్పీ చిదానంద రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: కుమార్తెను ప్రేమించాడని యువకుడి కాళ్లు, చేతులు నరికి చంపేశారు