ETV Bharat / state

హత్య కేసును ఛేదించిన పోలీసులు.. ఐదుగురు అరెస్ట్​ - kurnool district latest crime news

కర్నూలు జిల్లా మునగాల గ్రామంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ మహేశ్ తెలిపారు. ఈనెల 21న దుండగులు బోయ అన్నకాల దస్తగిరిని అతి కిరాతకంగా కొడవళ్లతో నరికి చంపారు.

dsp mahesh announced murder case details
హత్య కేసు నిందితులు వివరాలు వెల్లడించిన డీఎస్పీ
author img

By

Published : Mar 26, 2021, 5:17 PM IST

ఈనెల 21న కర్నూలు జిల్లా గూడూరు మండలం మునగాల గ్రామంలో.. బోయ అన్నకాల దస్తగిరిని అతి కిరాతకంగా కొడవళ్లతో చంపిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు కర్నూలు డీఎస్పీ మహేష్ వెల్లడించారు. గూడూరు పోలీస్ స్టేషన్​లో దేశి సమక్షంలో నిందితుల వివరాలు వెల్లడించారు. పాతకక్షలు, ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు కారణంగానే మృతుడు దస్తగిరిని హత్య చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

గ్రామానికి చెందిన బోయగడ్డం రామాంజనేయులు, బోయ కోటకొండ ఏసు నాయుడు, బోయ కోటకొండ హనుమంతు, బోయ కుంటి చేయి గోపాల్ అలియాస్ బోయ చిన్న గోపాల్, బోయ రాముడు అనే ఐదుగురిని అరెస్టు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు సీఐ శ్రీధర్, గూడూరు ఎస్ఐ నాగార్జున, పీఎస్ఐ మమత, ఏఎస్ఐ గోపాల్ తదితరులు ఉన్నారు.

ఇవీ చూడండి...

కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా భారత్​ బంద్​

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.