ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొన్న ఘటనలో... బస్సులోని ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాదం కర్నూలు జిల్లాలో జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న టీఎస్ ఆర్టీసీ బస్సుని... రాంగ్ రూట్ లో వచ్చిన లారీ ఢీ కొట్టింది. రోడ్డు నిర్మాణ జరుగుతున్నందున... ఆ మార్గంలో ఒక వైపు మాత్రమే రాకపోకలు సాగుతున్నాయి. దీంతో రాంగ్రూట్లో వచ్చిన లారీ... బస్సును ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు, లారీ ముందు భాగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
ఇదీ చదవండి: సప్లై బాయ్తో కస్టమర్ ఘర్షణ.. రెస్టారెంట్లో ఉద్రిక్తత