కర్నూలు జిల్లాలో అధికార పార్టీకి చెందిన నాయకులు మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతుంటే హోంశాఖ మంత్రి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మాజీమంత్రి భూమా అఖిల ప్రియ ప్రశ్నించారు. రాష్ట్రంలో దిశ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఒక్కరికైనా న్యాయం చేశారా అని మండిపడ్డారు. దేవరకొండ మండలంలోని ఓ బాలికపై కొందరు దాడికి పాల్పడ్డారు. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని తెదేపా నాయకులతో కలిసి అఖిల ప్రియ పరామర్శించారు. మహిళలపై దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ కేసులో అధికార పార్టీకి చెందిన వ్యక్తులు ఉన్నారని.. వారిని కేసు నుంచి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు ఒత్తిడికిలోను కాకుండా నిందితులను శిక్షించి బాధితురాలికి న్యాయాలని కోరారు.
ఇదీ చూడండి: ఉత్తరాంధ్ర సత్యం గల తల్లి...ఎరుకుమాంబ