ETV Bharat / state

'పార్టీ మారనందుకు పొలం తీసుకుంటామని బెదిరిస్తున్నారు' - కర్నూలులో రైతు ధర్నా

పార్టీ మారనందుకు తమ పొలం తీసుకునేందుకు అధికార పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఓ రైతు ఆందోళన చేపట్టారు. తనకు రాజకీయాలతో సంబంధం లేదని.. తన పొలం తనకు కావాలని అన్నాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా పుసులూరులో జరిగింది.

farmer dharna in kurnool
బాధిత రైతులు
author img

By

Published : Aug 21, 2020, 8:07 PM IST

పార్టీ మారనందుకు తమ పొలం తీసుకునేందుకు అధికార పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఓ రైతు ఆందోళన చేపట్టారు. కర్నూలు జిల్లా కల్లురు మండలం పుసులూరుకు చెందిన అయ్యస్వామికి 2 ఎకరాల 30 సెంట్ల పొలం ఉంది. దాన్ని అక్రమంగా తీసుకునేందుకు అదే గ్రామానికి చెందిన చిన్న అయ్యస్వామి ప్రయత్నం చేస్తున్నాడని రైతు ఆరోపించాడు.

అధికార పార్టీలోకి రానందుకు తన పొలంలోని పత్తి పంటను తొలగించారని చెప్పాడు. తమకు న్యాయం చేయాలని కలెక్టర్​కు వినతిపత్రం ఇచ్చి కార్యాలయం ముందు కుటుంబసభ్యులతో నిరసన తెలిపాడు. తనకు రాజకీయాలతో సంబంధం లేదని.. తన పొలం తనకు కావాలని అన్నాడు. భూమికి సంబంధించిన పాసు పుస్తకాలు, దస్తావేజులు అన్నీ ఉన్నాయని.. న్యాయం చేయాలని కోరాడు.

'చిన్న అయ్యస్వామి అనే అతను మా పొలంలోని పంట తొలగించాడు. ఎందుకు అని ప్రశ్నిస్తే వైకాపా నేత చెప్పినందుకే అలా చేశామని చెప్పాడు. మాకు పార్టీలతో సంబంధం లేదు. మేం సాధారణ మనుషులం. మా భూమికి సంబంధించి అన్ని కాగితాలు ఉన్నాయి. మా పొలం మాక్కావాలి.' -- అయ్యస్వామి, బాధిత రైతు

ఇవీ చదవండి..

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నిబంధనల చిక్కులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.