కర్నూలు జిల్లా డోన్ మండలం ఉడుములపాడు నకిలీ మద్యం కేసులో అబ్కారీ అధికారులు, పోలీసులు పురోగతి సాధించారు. డిసెంబర్ నెలలో నకిలీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు. కర్ణాటక రాష్ట్రం హుబ్లీకి చెందిన వినోద్ కల్లాల్ ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు తేలిందని పోలీసులు వివరించారు. వినోద్ హుబ్లీ నుంచి మద్యం సీసాల డమ్మీ మూతలు, స్పిరిట్ సరఫరా చేసేవాడని పోలీసులు చెప్పారు.
వినోద్‌తో పాటు కల్తీ మద్యం తయారీలో భాగస్వాములుగా ఉన్న మరో ఆరుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వీరి నుంచి భారీగా మద్యం, 6 వేల డమ్మీ మూతలు, 2 క్యాన్ల స్పిరిట్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టైన నిందితుల నుంచి వివరాలు సేకరించగా... మెుత్తం 24 మంది ఉన్నట్లు తేలిందన్నారు. ప్రస్తుతం ఏడుగుర్ని అదుపులోకి తీసుకోగా, 17 మంది పరారీలో ఉన్నారని వివరించారు. త్వరలోనే మిగతా నిందితులను పట్టుకుంటామన్నారు.
ఇదీ చదవండి: తూకంలో తేడా.. పత్తి వ్యాపారి మోసం