కర్నూలు జిల్లా బనగానపల్లి పట్టణంలో విచ్ఛలవిడిగా అక్రమ లేఅవుట్లు వేసి అమ్ముకుంటున్నారని మాజీ ఎమెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. అవుకు రోడ్డులోని వేసిన లేఅవుట్లను ఆయన గురువారం పరిశీలించారు. ఎమ్మెల్యే కాటసాని అక్రమ లేఅవుట్లకు మద్దతు ఇస్తున్నారని, స్థిరాస్తి వ్యాపారుల నుంచి రూ.కోట్లు తీసుకొని అధికారులు చర్యలు తీసుకోకుండా చూస్తున్నారని ఆరోపించారు.
కాసులు తీసుకోకపోతే వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకునేలా చూడాలని డిమాండ్ చేశారు. అక్రమ లేఅవుట్లతో ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం జరుగుతోందని, ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని, త్వరలోనే కోర్టుకు వెళ్లి రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆటకట్టిస్తామని హెచ్చరించారు. తెదేపా నాయకులు అత్తర్ జావెద్, బురానుద్దీన్, హర్షద్, రాయలసీమ సలాం, కలాం, అల్తాఫ్ హుసేన్, బొబ్బల మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: