తెలంగాణ ప్రభుత్వం అన్యాయంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని వైకాపా నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టులో నీరు లేకున్నా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గతంలో సీఎం కేసీఆర్ కలిసి సామరస్యంగా నీటి సమస్యను పరిష్కరించుకుందామని చెప్పారని.. ప్రస్తుతం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రాయలసీమ ప్రయోజనాల కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని ఆయన వ్యాఖ్యానించారు.
కలిసి మెలిసి ఉన్న తెలుగు ప్రజల మద్య తెలంగాణ నాయకులు జల వివాదాలు తెచ్చి... చిచ్చు పెడుతున్నారని కర్నూలులో విద్యార్థి సంఘల నాయకులు మండిపడ్డారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ నాయకుల ఫొటోలను రాయలసీమ విద్యార్థి సంఘం నాయకులు దహనం చేశారు. కరోనా సమయంలో అత్యవసరంగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు వెళ్తుంటే అంబులెన్స్ లకు అనుమతి ఇవ్వలేదని.. కర్నూలు ఆసుపత్రికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాసులు అందరు వస్తున్న వైద్యం అందిస్తున్నామన్నారు. ఇరురాష్ట్రాల నాయకులు సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని రెచ్చగొట్టే విధానాన్ని తెలంగాణ రాష్ట్ర నాయకులు విడనాడలన్నారు.
ఇదీ చదవండి: