ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిబంధనల పేరుతో పేదలకు పింఛను తొలగించారని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి కర్నూలులో ఆరోపించారు. పింఛన్‌కు అనర్హులను చేసేందుకు ఎనిమిది నిబంధనలు పెట్టారని విమర్శించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలను తొలగిస్తూ వస్తుందని మండిపడ్డారు. పింఛన్లో పేరు తొలగించడంతో కొందకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు 200 రూపాయలున్న పింఛన్ రెండు వేల రూపాయలు చేసి పేదలకు ఆసరాగా నిలబడ్డారని కొనియాడారు.
ఇవీ చూడండి...