కర్నూలులో చెప్పిన విషయాలను పూర్తిగా విని అనంతరం తనపై ఆరోపణలు చేయాలని మాజీ మంత్రి భూమ అఖిలప్రియ అన్నారు. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే చాలా ఆవేశంగా మాట్లాడటం సరి కాదన్నారు. ఇటీవల నంద్యాల ప్రాంతంలో జరిగిన న్యాయవాది హత్య, ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేసేందుకు తాను కుట్ర పన్నినట్టు చేసిన ఆరోపణలను వారంలోపు నిరూపించాలని సవాల్ విసిరారు. ఈ ఆరోపణలను నిరూపించలేకపోతే రాజీనామా చేయాలని డిమాండు చేశారు. ఇందుకు మీరు సిద్ధమైతేనే ఆరోపణలు చేయాలన్నారు.
న్యాయవాది రామచంద్రరావుపై నిందలు మోపడం సరికాదన్నారు. ప్రస్తుతం ఆయన తెదేపాకు రాజీనామా చేశారని, అలాగే కేసుకు సంబంధించి తదుపరి విచారణకు హాజరు కానని తప్పుకున్నట్లు లేఖ రాశారన్నారు. ఇందుకు వైకాపా సమాధానం చెప్పాలని డిమాండు చేశారు.
నంద్యాలలో ఎవరు బెదిరించినా తాను సహించనని చెప్పిన ఎమ్మెల్యే.. తన హయాంలోనే విద్యుత్తు గుత్తేదారుడు మునాఫ్ రూ.కోటికిపైగా విద్యుత్తు పనులు చేశాడని, ప్రస్తుతం తాము అనుకుంటే సబ్ స్టేషన్ పనులు ఎలా చేస్తాడని ఒకవైపు బెదిరిస్తూ తెలివిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సలాం ఆత్మహత్య సంబంధించి ఏ2 ముద్దాయిగా ఉన్న గంగాధర్‌తో, బంగారు దుకాణం యజమానికి సంబంధించి ఏడాది ఫోన్ కాల్‌డేటా చూస్తే వారి సంబంధాలు బయటపడతాయన్నారు.
ఇదీ చదవండి: