కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎర్రమట్టి తవ్వకాలు విచ్చలవిడిగా జరుగుతున్న ఎవరూ స్పందించడం లేదని మాజీ మంత్రి, తెదేపా నాయకురాలు భూమా అఖిల ప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేస్తే అధికారులు పట్టించుకోవడం లేదని.. పైగా ఫిర్యాదు చేసిన వారిపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె మండిపడ్డారు.
నర్సాపురం, కృష్ణాపురంలో ఎస్సీల పేరుతో వైకాపా నేతలు ఇలాంటి అక్రమాలు చేస్తూ నీఛానికి పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. సీజ్ చేసిన వాహనాలు పోలీస్ స్టేషన్లో కాకుండా వైకాపా నేతల ఇళ్ళ దగ్గర ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చున్నారు. తవ్వకాలకు వైకాపా నేతలకే అనుమతిస్తూ.. ఇతరులకు ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. వైకాపా నేతలకు, అధికారులకు వారం రోజుల గడువు ఇస్తున్నామని... అక్రమాలు ఆపాలని లేదంటే తామే అడ్డుకుంటామని అఖిల ప్రియ హెచ్చరించారు. ఈ అక్రమాలతో స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి భాగం ఉందని అఖిలప్రియ ఆరోపించారు. ఇరిగేషన్, రెవెన్యూ, మంత్రులకు కూడా ఫిర్యాదు చేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి:
CBN LETTER TO DGP: హత్య కేసులో సాక్షులకు బెదిరింపులు.. డీజీపీకి చంద్రబాబు లేఖ