ETV Bharat / state

తానా ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ - కర్నూలులో తానా తాజా వార్తలు

తానా ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో సరకుల పంపిణీ చేపట్టారు. పేదలకు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి చేతుల మీదుగా బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేశారు.

essential goods distribution tana
తానా ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ
author img

By

Published : May 22, 2020, 6:36 PM IST

కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ కేంద్రంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం... తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు వేల కుటుంబాలకు సరకుల అందజేశారు. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి చేతుల మీదుగా బియ్యం, కంది బేడలు పంపిణీ చేశారు. తానా ఫౌండేషన్ అధ్యక్షుడు జయశేఖర్, ఛైర్మన్ నిరంజన్, కార్యదర్శి రవి సహకారంతో జిల్లాలో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు సమన్వయకర్త రాజశేఖర్ పేర్కొన్నారు. లాక్​డౌన్ విధించిన అప్పటి నుంచి వలస కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, నిరాశ్రయులకు తానా సహకారంతో బాలాజీ క్యాంటీన్ ద్వారా ఉచిత భోజనాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చూడండి...

'కరోనా సమయంలో కరెంటు బిల్లులు పెంచటం శోచనీయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.