ఈ నెల 23న జరిగే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో అధికారులు సక్రమంగా విధులు నిర్వహించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ సూచించారు. ఎన్నికల రిటర్నింగ్, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు ఓట్ల లెక్కింపుపై కలెక్టర్ కార్యాలయంలో శిక్షణ ఇచ్చారు. ఓట్ల లెక్కింపుపై ఈ నెల 7న అమరావతిలో శిక్షణ పొందిన ఆర్వోలు, మాస్టర్ ట్రైనర్లు కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఆర్వోలకు, ఏఆర్వోలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు.
ఇవీ చూడండి-అయిదేళ్లయినా నిండలేదు.. ఆర్చరీలో ఆరితేరింది