ETV Bharat / state

గుప్త నిధుల కోసం తవ్వకాలు.. ఎనిమిది మంది అరెస్ట్ - excavating treasure hunt in maddikera news

కర్నూలు జిల్లాలో గుప్తనిధుల తవ్వకాలకు పాల్పడిన ఎనిమిది మందిని అరెస్ట్​ చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి జేసీబీ, మూడు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, 8 సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ చెప్పారు.

eight people arrested
ఎనిమిది మంది అరెస్ట్
author img

By

Published : Jan 10, 2021, 3:41 PM IST

కర్నూలు జిల్లాలో గుప్తనిధుల తవ్వకాలకు పాల్పడిన 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి జేసీబీ, మూడు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, ఎనిమిది చరవాణులు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. చిప్పగిరి మండలం కుందనగుర్తి గ్రామానికి చెందిన దాసరి వెంకటేశ్​ అనే వ్యక్తి మరికొంత మందితో కలిసి తవ్వకాలు జరిపాడు. మద్దికేర గ్రామంలో ఉన్న పురాతన దేవాలయం కింద 2020 డిసెంబర్ 16న నిధుల కోసం వెతికారని జిల్లా ఎస్పీ తెలిపారు. కానీ వారికి ఎలాంటి నిధులు లభించలేదన్నారు. సామాజిక మాధ్యమాల్లో దేవాలయాల గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

ఇదీ చదవండి: కర్నూలు జిల్లాలో మత సామరస్య కమిటీ ఏర్పాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.