ఓ వ్యక్తిని ప్రత్యర్థులు కిరాతకంగా చంపిన ఘటన కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గం చనుగొండ్లలో జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పొలానికి వెళ్లిన చిన్న పుల్లారెడ్డి, అతని కుమారుడు శివారెడ్డిపై ప్రత్యర్థులు కర్రలతో దాడికి దిగారు. ఈ ఘటనలో గాయపడ్డ పుల్లారెడ్డి ఆసుపత్రికి తరిలిస్తుండగా అక్కడిక్కడే చనిపోయాడు. గ్రామానికి చెందిన పరమేశ్వరరెడ్డి, చెన్నకేశవరెడ్డి మోహన్ రెడ్లు తమపై దాడికి వచ్చారని బాధితుడు శివారెడ్డి ఆరోపించాడు. స్థానిక ఎమ్మెల్యే ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి: