కరోనా వ్యాప్తి కట్టడి కోసం ప్రజలు స్వీయ క్రమశిక్షణ కలిగి ఉండాలని... ప్రభుత్వం పిలుపునిచ్చిన లాక్డౌన్కు సహకరించాలని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ బ్రహ్మారెడ్డి కోరారు. నిరంతరం చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవటం, సామాజిక దూరం పాటించటం, ఇళ్లలోంచి బయటకు రాకపోవటం వంటి జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను నియంత్రించవచ్చని స్పష్టం చేశారు. దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్న డాక్టర్. బ్రహ్మారెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చూడండి: