అక్రమంగా తొలగించిన మధ్యాహ్న భోజన ఏజెన్సీని తిరిగి ఇప్పించాలని సుధానాగరాణి అనే దివ్యాంగురాలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణం పాతపేటకు చెందిన నాగసుధారాణి పుట్టుకతోనే దివ్యాంగురాలు. గత 12 ఏళ్లుగా పాతపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. అకారణంగా తనను తొలగించి, ఇతరులకు ఇచ్చారని ఆమె వాపోయారు. సుధారాణి దీక్షకు పలువురు మహిళలు మద్దతు తెలిపారు.
ఇదీచదవండి.