కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్ సలామ్ కుటుంబం ఆత్మహత్య చేసుకోవటం బాధాకరమని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. పట్టణంలోని మూలసాగరంలో మృతుల కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఘటన అందరి మనసు కలచివేసిందని ఆయన అన్నారు. వారిని ఓదార్చి ధైర్యంగా ఉండాలని చెప్పారు.
ఆత్మహత్యకు కారణమైన సీఐతో పాటు హెడ్ కానిస్టేబుల్ను అరెస్ట్ చేశామని ఆయన అన్నారు. కేసుని లోతుగా దర్యాప్తు చేయిస్తామన్నారు. వారి చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకుని శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. తప్పకుండా బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి వెంట నంద్యాల పార్లమెంట్ సభ్యుడు పోచా బ్రహ్మానంద రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యేలు శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి, హఫీజ్ ఖాన్ తదితరులు ఉన్నారు.
ఇదీ చదవండి: కుటుంబం ఆత్మహత్య ఘటన.. దర్యాప్తు వేగవంతం