కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు 2018-20 బ్యాచ్ కు చెందిన డీఈడీ మేనేజ్మెంట్ కోటా విద్యార్థులు ఆందోళనకు దిగారు. మంత్రి గుమ్మనూరు జయరాంను అడ్డుకున్నారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కేవలం కన్వీనర్ కోటా విద్యార్థులకు మాత్రమే పరీక్షలు రాసేందుకు అనుమతివ్వటంపై వారు నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.