తమ భూములను అగ్రవర్ణాలకు చెందిన వారు దౌర్జన్యంగా తీసుకున్నారని కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట దళితులు ఆందోళన చేపట్టారు. కర్నూలు జిల్లా రుద్రవరం మండలం యల్లావత్తుల గ్రామంలో 200 ఎకరాల భూమిని అగ్రవర్ణాలు దౌర్జన్యంగా తీసుకున్నారన్నారని ఆరోపించారు. కలెక్టర్ వెంటనే స్పందించి తమ భూమి తమకు వచ్చేలా చూడాలని కోరారు. గ్రామంలోని చెరువు పనులకు, ఉపాధి హామీ పనులకు వెళుతుండగా పొరుగు గ్రామం వారు తమను అడ్డకుంటున్నారన్నారని వాపోయారు.
ఇవీ చదవండి: