పత్తి దిగుబడులు లేక ఆదోని మార్కెట్ వెలవెల - ఆదోని పత్తి దిగుబడులు లేక మార్కెట్ వెలవెల
కర్నూలు జిల్లా ఆదోని పత్తి యార్డులో దిగుబడులు లేక మార్కెట్ వెలవెలబోతోంది. యార్డులో కూలి ధరలు పెంచాలని మూడు రోజుల నుంచి హమాలీలు సమ్మె చేస్తున్నారు. ఈ కారణంగా నిల్వలు లేకుండా పోయాయి. మరోవైపు సమ్మె విషయం తెలియని రైతులు... పత్తిని అమ్మకానికి తెచ్చారు. యార్డులో ఉంచలేక.. ఇంటికి తీసుకెళ్లలేక అక్కడే పడిగాపులు కాశారు. అధికారులు స్పందించి వెంటనే సమస్య పరిష్కరించాలని కోరారు.