కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ వైద్యశాలలో ఏప్రియల్ 15 న కరోనా వైరస్ నిర్దారణకు ప్రత్యేక ప్రయోగశాల ఏర్పాటు చేశారు. లక్షలు వెచ్చించి ఐదు నూతన. " ట్రూనాట్ " యంత్రాలను కేటాయించారు. 28 మంది ల్యాబ్ టెక్నిషియన్లతో ఈ నెల 4 వతేది వరకు ఆ యంత్రాలతో పరీక్షలు కొనసాగాయి. తిరిగి ఆ సిబ్బందిని వారు పనిచేసే ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు పంపించారు. ఈ కారణంగా పరీక్ష చేసే వారు లేకపోవడంతో ప్రయోగశాల మూసివేశారు. పది రోజులుగా పరీక్షలు చేయట్లేదు. ఈ యంత్రాలతో గంటకు 12 మందికి కరోనా పరీక్షలు చేసే వెసులుబాటు ఉంటుంది. త్వరలోనే ఈ యంత్రాలతో పరిక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఇదీ చూడండి.
12 శాతం వడ్డీతో జీతాలు కోరుకోలేదు: ప్రభుత్వ ఉద్యోగుల సంఘం