శ్రీశైలం ఆనకట్ట పరిరక్షణకు మరికొన్ని పరిశోధనలు అవసరమని డ్యాం సేఫ్టీ ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్ కమిటీ నిర్ణయించింది. ఆనకట్ట పరిరక్షణ పనులు చేపట్టడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని కమిటీ ఛైర్మన్ పాండ్యా స్పష్టం చేశారు. మూడు రోజులపాటు ఆనకట్ట వద్ద పర్యటించిన కమిటీ... ఇంజినీర్లకు పలు సూచనలు చేసింది. శ్రీశైలం ఆనకట్టకు ఇప్పటికిప్పుడు ఎటువంటి ప్రమాదం లేదన్న కమిటీ... చిన్న చిన్న సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించుకునే విధంగా అధికారులు చొరవ చూపాలని సూచించింది. ప్రభుత్వం ఆనకట్ట నిర్వహణకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డ్రిప్ ప్రోగ్రాం, ప్రపంచబ్యాంకు ద్వారా నిధులు సేకరించుకొని ఆనకట్ట పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఇదీ చదవండి: