ఇష్ట దైవం వినాయకుడిని విభిన్న రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చేలా చేస్తున్నారు గణేశ్ ఉత్సవ సమితి నిర్వహకులు. ఒకరు అగ్గిపెట్టెలతో... మరొకరు పసుపు కొమ్ములతో... కాదేది గణపతి రూపునకు అనర్హం అన్నట్టు ఏక దంతుడిని తీర్చిదిద్దుతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు కోట వీధిలో రూపాయి నాణేలతో రూపొందిన గణపయ్య.. భక్తులకు దర్శనమిస్తున్నాడు. సుమారు 12 వేల రూపాయి కాయిన్లతో ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఎనిమిది అడుగుల ఎత్తున్న ఈ గణనాథుడు.. విశేషంగా ఆకట్టుకుంటున్నాడు.
ఇవీ చూడండి