కర్నూలు జిల్లా అవుకు మండలం గోకుల దిన్నెలో అంతుచిక్కని వ్యాధితో నాటు కోళ్లు మృతి చెందడం కలకలం రేపుతోంది. గడిచిన మూడు రోజుల్లో సుమారు వంద నాటు కోళ్ల వరకు మృతి చెందినట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాధి సోకిన కోళ్లు ... గొంతు, చెవులు, కాళ్లు వద్ద పచ్చగా మారిపోయి.... అనంతరం చనిపోతున్నాయి. ఇటీవల కోళ్లకు బర్డ్ ప్లూ వ్యాధి సోకినట్లు ప్రచారం జరుగుతుండటంతో భయాందోళనలు చెందుతున్నారు. ఈ విషయాన్ని పశువైద్య అధికారి ఐశ్వర్య దృష్టికి తీసుకువెళ్లగా డయేరియా కారణంగా మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె వెల్లడించారు. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడిన కోళ్లను పరీక్షించమని తెలిపారు.
ఇవీ చదవండి: 'బర్డ్ ఫ్లూ ప్రభావం లేనప్పటికీ అప్రమత్తంగా ఉండాలి'