కర్నూలు జిల్లా అవుకు మండలం చిన్నంపల్లిలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. మూడు రోజుల కిందట ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ద్విచక్ర వాహనాలకు నష్టపరిహారం విషయంలో జరిగిన ఘర్షణలో చిన్నంపల్లికి చెందిన బోయ మద్దిలేటి, బోయ మధులపై పక్కనున్న శివవరం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కత్తులు, కర్రలతో దాడి చేశారు.
తీవ్రగాయాలైన మద్దిలేటి, మధులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులకు తీవ్రగాయాలు కావడంతో చిన్నంపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిపై అవుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘర్షణలు జరగకుండా పోలీసులు ముందస్తుగా గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి: