కర్నూలు జిల్లా నంద్యాల రెండో పట్టణ పోలీసు స్టేషన్ సిఐ కంబగిరి రాముడును విధుల నుంచి సస్పెండ్ చేశారు. కరోనా వైరస్ దృష్ట్యా లాక్ డౌన్ ఉన్నప్పటికీ బ్యాంకు కోచింగ్ విద్యార్థులను వారి ప్రాంతాలకు పంపేందుకు అనుమతి పత్రాలు ఇచ్చినందుకు గానూ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర సరిహద్దులో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారనే సమాచారం పోలీస్ అధికారులకు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇదీ చదవండి: లాక్డౌన్ ప్రభావంతో నిర్మానుష్యంగా ఎమ్మిగనూరు