వైద్యుల నిర్లక్ష్యంతోనే చిన్నారి మృతి చెందినట్లు కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి ముందు కుటుంబం ఆందోళనకు దిగింది. స్థానిక బోగ్గులైనుకు చెందిన మాబాష, రేష్మా దంపతులు చిన్నారి రఫీ అనారోగ్యంతో ఉన్నందన రఫా చిన్న పిల్లల ఆస్పత్రిలో చేర్పించారు. వాంతులు, విరేచనాలతో శిశువు నీరసించి పోయాడు. చికిత్స చేయని సిబ్బంది.. బాలుడికి పాలు ఇవ్వాలని తల్లికి సూచించారు. అప్పటికే నిరసించిన బాలుడు ఊపిరి ఆడక మృతి చెందినట్లు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిపై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: