ETV Bharat / state

సెల్​ ఫోన్ల దొంగ.. సీసీ కెమెరాలో చిక్కాడు..! - ఆదోనిలో సెల్​ ఫోన్ దొంగ పట్టివేత

కర్నూలు జిల్లా ఆదోనిలో సెల్​ ఫోన్​ దొంగను సీసీ కెమెరాలు పట్టించాయి. ఆదోనిలోని రద్దీ ప్రాంతాల్లోని దుకాణాల్లో గుట్టుచప్పుడు కాకుండా చోరీ చేస్తున్న దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు.

cell phone thief  caught by cc camera footage at adhoni
సెల్​ ఫోన్లో దొంగ.. సీసీ కెమెరాలో చిక్కాడు..
author img

By

Published : Jun 12, 2021, 7:34 AM IST

సెల్​ ఫోన్ల దొంగ.. సీసీ కెమెరాలో చిక్కాడు..

కర్నూలు జిల్లా ఆదోనిలో సెల్ ఫోన్ దొంగను పోలీసులు అదుపులో తీసుకున్నారు. దొంగ నుంచి లక్ష రూపాయలు విలువ చేసే 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఒకటో పట్టణ పోలీసులు తెలిపారు. ఆదోనిలోని రద్దీ ప్రాంతాల్లోని దుకాణాల్లో గుట్టుచప్పుడు కాకుండా చరవాణులు (సెల్‌ఫోన్లు) చోరీ చేసే దొంగను సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు పట్టుకున్నామన్నారు.

స్థానిక జీబీ కాంప్లెక్స్‌లో ఉన్న నినాయక స్టీల్‌ షాపులో గేవారామ్‌ అనే వ్యక్తికి చెందిన వీవో ఎక్స్‌-50 సెల్‌ఫోన్‌ను ఈ నెల 5న ఓ గుర్తుతెలియని యువకుడు దొంగతనం చేశాడు. దీనిపై బాధితుడు ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు స్టీల్‌ షాపులో ఓ యువకుడు దొంగతనం చేస్తుండగా సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలను సేకరించారు. చోరీకి పాల్పడింది ఎస్కేడీ కాలనీకి చెందిన బి.వీరేష్‌గా గుర్తించి అరెస్టు చేశారు.

అతని వద్ద నుంచి రూ.లక్ష విలువ చేసే 8 విలువైన చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి మాటలు రావని, వినికిడి లోపం ఉందని.. చాకచక్యంగా దుకాణాల్లోని చరవాణులు, ఇతర వస్తువుల దొంగతనానికి పాల్పడుతుంటాడని విచారణలో తేలింది. గతంలోనూ ఇతనిపై కేసులు నమోదయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

నకిలీ పత్రాలతో రూ.2 కోట్లకు బురిడీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.