ETV Bharat / state

Drone: శ్రీశైలంలో డ్రోన్ సంచారంపై విచారణ వేగవంతం: ఎస్పీ ఫకీరప్ప

author img

By

Published : Jul 6, 2021, 8:45 AM IST

శ్రీశైలంలో డ్రోన్ సంచారంపై విచారణ ముమ్మరం చేసినట్లు ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. ఈ ఘటనలో.. అనుమానితులను ప్రశ్నించినట్లు ఆయన తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

CASE REGISTERED AGAINST THE SUSPECTS IN THE INVESTIGATION ON DRONE MOVEMENTS AT SRISAILAM
శ్రీశైలంలో డ్రోన్ సంచారంపై విచారణ వేగవంతం: ఎస్పీ ఫకీరప్ప

శ్రీశైలంలో డ్రోన్ల సంచారంపై పోలీసులు ముమ్మరంగా విచారణ చేస్తున్నారు. ఆత్మకూరు డీఎస్పీ శృతి ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన పోలీసులు.. సున్నిపెంటకు చెందిన ఒక ఫొటో స్టూడియో నిర్వాహకుడితో పాటు ముగ్గురు అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం వారిని విడిచిపెట్టారు. జిల్లా ఎస్పీ ఫకీరప్ప.. శ్రీశైలం చేరుకొని కేసు పురోగతి గురించి ఆరా తీశారు. శుక్రవారం రాత్రి ఒక్కరోజే శ్రీశైలంలో డ్రోన్‌ తిరిగిందన్న ఎస్పీ.. మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అనుమతులు లేకుండా డ్రోన్ల తిప్పినందుకు.. గుర్తుతెలియని వ్యక్తులపై ఐపీసీ సెక్షన్ 287, 263 కింద కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. నిందితులెవరన్నది ఇప్పుడే చెప్పలేమని.. దర్యాప్తు ముమ్మరంగా చేపట్టి త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు.

ఇదీ చదవండి:

POLICE RECRUITMENTS : వచ్చే జాబ్‌ క్యాలెండర్‌ నుంచి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాల భర్తీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.