కర్నూలు జిల్లా ఆదోని బార్పేటలో ఉంటున్న వివాహిత భానును... కుటుంబ కలహాల నేపథ్యంలో సొంత మరిదే కత్తితో పొడిచి హత్య చేశాడు. భాను.. తన చెల్లికి ఖాసీం అనే వ్యక్తితో వివాహం చేసింది. వారిద్దరికీ సఖ్యత లేక ఎప్పడూ గొడవ పడుతుండేవారు. ఎప్పటిలాగే వారికి గొడవ జరుగుతున్న సమయంలో భాను అక్కడికి వెళ్లగా... ఖాసీం ఆగ్రహించాడు. వదిన అని కూడా చూడకుండా కత్తితో పొడిచి హత్య చేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: కర్నూలు జిల్లాలో వదిన, మరిది ఆత్మహత్య