ఈత సరదా.. విద్యార్థి ప్రాణం తీసింది.. - కర్నూలులో విద్యార్థి మృతి
కర్నూలు జిల్లా మంత్రాలయంలోని పులికనుమ జలాశయంలో మునిగి బీమారెడ్డి అనే పదో తరగతి విద్యార్థి మృత్యువాత పడ్డాడు. కోసిగి గ్రామానికి చెందిన బీమారెడ్డి... నిన్న మధ్యాహ్నం స్నేహితులతో కలిసి జలాశయానికి వెళ్లాడు. ఈత కొడదామని అందులో దిగగా లోతు ఎక్కువగా ఉండి నీటిలో మునిగిపోయాడు. గజఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టగా... ఈ రోజు ఉదయం మృతదేహం లభ్యమైంది.