రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రాయలసీమకు ఒరిగేదేమీ లేదని.... నెల్లూరు జిల్లాకు నీటిని తరలించుకుపోవడానికి కుట్రలు పన్నారని భాజపా నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ మధ్య జరిగిన కేఆర్‌ఎంబీ సమావేశంలో రాయలసీమకు గుండె కాయలాంటి గుండ్రేవుల ప్రాజెక్టు గురించి కనీసం ప్రస్తావించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తుంగభ్రద నీటిని కృష్ణా నది ద్వారా కోస్తాకు తరలించుకుపోతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా రాయలసీమ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోవాలని కోరారు.
ఇవీ చదవండి: