ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్ ఢీ కొన్న ఘటనలో వ్యక్తి మృతి - లింగంబోడులో బైక్ ట్రాక్టర్ ఢీ కొన్నాయి
కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గం అవుకు మండలం లింగంబోడులో ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్ ఢీ కొన్న ఘటనలో సబ్బన్న అనే వ్యక్తి మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుణ్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సుబ్బన్న కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లింగంబోడులో బైక్ ట్రాక్టర్ 'ఢీ'