కర్నూలు జిల్లా నంద్యాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమితికి ముగ్గురు డైరెక్టర్ల ఎన్నిక ప్రక్రియ జరిగింది. ఈ ఎన్నికల్లో వైకాపా నాయకులు విజయం సాధించారు. నూతన అధ్యక్షుడిగా ఎస్వీ జగన్మోహన్ రెడ్డి ఎంపికయ్యారు.
పదవి నుంచి దిగిపోతూ.. గత అధ్యక్షుడు భూమా నారాయణరెడ్డి ఉద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు సైతం తమవాడే అంటూ ఆనందించారు. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా.. జగన్మోహన్ రెడ్డికి ఆశీర్వాదం అందిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: