ETV Bharat / state

కర్నూలు జిల్లాలో కన్నుల పండువగా భోగి మంటలు - bhogi fire in emmiganur

కర్నూలు జిల్లా వ్యాప్తంగా.. భోగి సంబరాలు అంబరాన్నంటాయి. అందరూ కలిసి భోగి మంటలు వేసి, అందులో పాత వస్తువులు దహనం చేశారు. మహిళలు ఇళ్ల ముందు సంక్రాంతి ముగ్గులు వేశారు.

bhogi fires at karnool district
కర్నూలు జిల్లాలో కన్నులపండుగగా భోగిమంటలు
author img

By

Published : Jan 13, 2021, 1:25 PM IST

Updated : Jan 13, 2021, 5:46 PM IST

కర్నూలు జిల్లాలో కన్నులపండుగగా భోగిమంటలు

కర్నూలులో సంక్రాంతి పండుగ సందడి నెలకొంది. మూడు రోజుల సంక్రాంతి వేడుకల్లో ముందుగా భోగి పండుగను నగర ప్రజలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున లేచి భోగి మంటలు వేసుకొని మహిళలు నృత్యాలు చేశారు.

చాణక్యపురి కాలనీ వాసులు అందరూ కలిసి సామూహికంగా భోగి వేడుకలు చేశారు. సామూహికంగా అందరూ కలిసి భోగి మంటలు వేసి, అందులో పాత వస్తువులు దహనం చేశారు. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి పూర్తిగా తుడుచుకుని పోవాలని.. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ భోగి మంటలు వేసుకునట్లు నగర వాసులు తెలిపారు.. మహిళలు ఇళ్ల ముందు సంక్రాంతి ముగ్గులు వేశారు.

ఎమ్మిగనూరు

ఎమ్మిగనూరులో భోగి సందర్భంగా ప్రజలు తెల్లవారుజామున ఇళ్ల ముందు భోగి మంటలు వేశారు. మంటల్లో కట్టెలు పనికి రాని వస్తువులు వేసి సంబరాలు చేసుకున్నారు.

నంద్యాలలో...

నంద్యాలలో ఆయుష్ యోగా సమితి సభ్యులు భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సమస్యలు తొలిగి సిరి సంపదలు సమకురాలని మంటలు వెలిగించారు.

ముగ్గుల పోటీలు..

rangoli compitition
కల్లూరులో ముగ్గుల పోటీ

కర్నూలు నగరంలోని కల్లూరులో ఎమ్మార్పీస్ నేతలు మహిళలకు మగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీలను డీఎస్పీ మహేష్ ప్రారంబించారు. పండుగలు మన సంస్కృతి సాంప్రదాయలను ప్రతిబింబిస్తాయని ఆయన అన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో సంక్రాంతి ముగ్గులు వేశారు. పోటీల్లో పాల్గొన్న వారికి నిర్వహకులు, బహుమతులను అందజేశారు.

ఇదీ చూడండి:

ముగ్గుల పోటీలతో ముందే వచ్చిన సంక్రాంతి...

Last Updated : Jan 13, 2021, 5:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.