ETV Bharat / state

వర్కూరు  సమీపంలో ఆటో బోల్తా... ఏడుగురికి గాయాలు - injured

కర్నూలు జిల్లా వర్కూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో బోల్తాపడి ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఆటోబోల్తా
author img

By

Published : Jul 3, 2019, 2:47 PM IST

ఆటో బోల్తా... ఏడుగురికి గాయాలు

దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా..ఆటో బోల్తా పడి ముగ్గురికి తీవ్ర గాయాలు, మరో నలుగురికి స్వల్ప గాయాలైన ఘటన కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వర్కూరు సమీపంలో చోటు చేసుకుంది. నందికొట్కూరుకు చెందిన మద్దిలేటి.. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ఉరుకుందకు వెళ్లారు. ఈరన్న స్వామిని దర్శించుకున్న అనంతరం తిరిగి వస్తుండగా వారి ఆటో బోల్తా పడింది. మద్దిలేటితో పాటు ఆయన భార్య గోవిందమ్మ, వారి కుమార్తె చంద్రకళకు తీవ్ర గాయాలయ్యాయి. మరో నలుగురూ చిన్న గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను కోడుమూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం 108 వాహనంలో కర్నూల్ ఆస్పత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి

సమస్యల పరిష్కారానికి పారిశుద్ధ్య కార్మికుల ధర్నా

Intro:Ap_cdp_46_03_kalasalallo_madyahna bhojanam_amalu cheyali_Av_Ap10043
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించాలని ఆర్ఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశాంత డిమాండ్ చేశారు. కడప జిల్లా రాజంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ఆర్ఎస్ యూ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద బైఠాయించారు. ప్లేట్లు పట్టుకుని బువ్వ పెట్టండి సార్ అంటూ నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ ఎంతో మంది నిరుపేద విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటున్నారని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల సౌలభ్యం కోసం గత ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ పథకాన్ని రద్దు చేయడంతో ఎంతోమంది విద్యార్థులు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి ప్రారంభించాలని కోరారు.

Body:ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి

Conclusion:కడప జిల్లా రాజంపేట

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.