కర్నూలు జిల్లా ఆదోనిలో తెదేపా నాయకుడు గోపాల్ రెడ్డిపై రాజకీయ ప్రత్యర్థులు దాడి చేశారు. పట్టణంలోని జిమ్ రహదారి నుంచి గోపాల్ రెడ్డి రాత్రి ఇంటికి వెళ్తుండగా... దాడి చేశారు. తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తెదేపా నేతలు ఓ పార్టీపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి భౌతిక దాడులపై ఆందోళనలకు దిగుతామని తెలుగు యువత నాయకులు భూపాల్ రెడ్డి హెచ్చరించారు.
ఇదీ చదవండి : కాకినాడలో కలకలం... ఏడేళ్ల బాలిక అపహరణ