కర్నూలు జిల్లా కోడుమూరు ఎస్సై వేణుగోపాల్ పై హత్యాయత్నం జరిగింది. గోరంట్ల గ్రామంలో అక్రమ మద్యం విక్రయాలపై తనిఖీ చేసేందుకు వీఆర్ గా ఉన్న వేణుగోపాల్…. తన సిబ్బందితో కలిసి సివిల్ దుస్తుల్లో గురువారం అర్ధరాత్రి వెళ్లారు. ఎటువంటి మద్యం లభించకపోవడంతో తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యలో వైకాపాకు చెందిన గ్రామ సర్పంచి బాలకృష్ణ అనుచరులు వారిని అడ్డుకున్నారు. గ్రామానికి ఎందుకు వచ్చారని పోలీసులపై దాడికి దిగారు. ఈ క్రమంలో ఎస్సై ఎడమ చేతి వేలుకు గాయమయ్యింది. ఈ ఘటనపై కోడుమూరు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై పై దాడి చేసినందుకు గోరంట్ల సర్పంచి సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సర్పంచి బాలకృష్ణ పరారీలో ఉన్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: కర్నూలు జిల్లాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ.. ఏడుగురికి తీవ్ర గాయాలు