కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాలపల్లి గ్రామ ఏఎన్ఎంను ఓ యువకుడు వేధింపులకు గురి చేస్తున్నాడు. తరచూ ఫోన్ చేస్తూ అసభ్య పదజాలంతో దూషించాడు. విసిగిపోయిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు వీరారెడ్డిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
మండలంలోని మహిళా ఉద్యోగులకు రక్షణ లేకుండాపోయిందని.. పలువురు మహిళలు చెబుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: FIRE ACCIDENT: కాకినాడ తీరంలో భారీ అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది