- క్రిస్మస్ సందడితో.. విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతున్న ప్రార్థనా మందిరాలు
రాష్ట్రంలో క్రిస్మస్ సందడి నెలకొంది. ఏసు క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని అర్థరాత్రి నుంచి చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. విద్యుత్ కాంతుల్లో ప్రార్థనా మందిరాలు వెలుగులీనుతున్నాయి. బాలఏసు గీతాలను ఆలపిస్తూ, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. పిల్లలకు చాక్లెట్లు, బహుమతులను శాంతాక్లాజ్ పంచుతున్నారు.
- రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన తెలుగు జాతిపిత పొట్టి శ్రీరాములు: సాయిచంద్
ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాముల గొప్పతనం భావితరాలకు తెలియాలనే సంకల్పంతో సినీ నటుడు త్రిపురనేని సాయిచంద్ పాదయాత్ర చేశారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములును భారతరత్నతో గౌరవించాలని అన్నారు.
- సంక్రాంతికి కష్టమే: ప్రయాణికుల రద్దీకి తగ్గట్లుగా లేని రైళ్లు
సంక్రాంతి పండుగ రద్దీ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. కానీ రైల్వే శాఖ ప్రకటించిన తేదీలు, రూట్లను పరిశీలిస్తే ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా లేవు..
- మట్టి గాజుల్లో మాదక ద్రవ్యాలు.. ముఠా ఆట కట్టించిన పోలీసులు
దగదగ మెరిసే గాజుల మాటున మత్తు దందా సాగిస్తున్న ఓ ముఠా ఎత్తులను హైదరాబాద్ పోలీసులు చిత్తుచేశారు. వివిధ ప్రాంతాల నుంచి డ్రగ్స్‌ను తీసుకువచ్చి హైదరాబాద్ అడ్డాగా విదేశాలకు పంపుతున్న కేటుగాళ్ల ఆట కట్టించారు. రూ.3 కోట్లకు పైగా విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుని.. వెనకుండి నడిపిస్తున్న వారి కోసం ఆరా తీస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ వ్యవహారం సాగుతుందని గుర్తించిన పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి తీగలాగుతున్నారు.
- వాజ్‌పేయీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి సహా ప్రముఖుల ఘన నివాళి
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ జయంతి సందర్భంగా దిల్లీలోని ఆయన స్మారకం సదైవ్ అటల్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సహా కేంద్ర మంత్రులు నివాళులర్పించారు. పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు. దేశాన్ని పటిష్ఠంగా అభివృద్ధిమయంగా మార్చేందుకు ఆయన జీవితాన్నే అంకితం చేశారని కొనియాడారు. ఆయన అభివృద్ధి కార్యక్రమాలు మిలియన్ల మంది భారతీయులపై సానుకూల ప్రభావం చూపాయని ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు.
- 1500 కిలోల టమాటాలతో భారీ శాంతాక్లాజ్
క్రిస్మస్ సంబరాల నేపథ్యంలో ఒడిశా పూరీకి చెందిన అంతర్జాతీయ శిల్పి సుదర్శన్ పట్నాయక్ భారీ శాంతాక్లాజ్ సైకత శిల్పాన్ని రూపొందించారు. ఇసుకతో పాటు 1500 కిలోల టమాటాలతో శాంతాక్లాజ్‌ను తయారు చేశారు. ఈ శిల్పం 27 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పు ఉంటుంది. దీనికి 15 మంది శిష్యులు సహకరించారని సుదర్శన్ పట్నాయక్ వివరించారు.
- ఏవీ గత క్రిస్మస్ కాంతులు..! రష్యా దండయాత్రతో వేడుకలకు దూరంగా ఉక్రెయిన్
వైమానిక దాడులతో ఉక్రెయిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రష్యా.. యుద్ధ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా అనేక దారుణాలకు పాల్పడుతుంది. ఉక్రెయిన్‌పై దండయాత్ర సాగిస్తున్న రష్యా సైనికులు అరాచకాలు సృష్టిస్తున్నారు. గత సంవత్సరం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్న ఉక్రెయిన్.. ఇప్పుడు యుద్ధంతో విలవిలలాడుతుంది.
- ఏపీ, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
- ఆదుకున్న శ్రేయస్, అశ్విన్.. బంగ్లాతో టెస్ట్ సిరీస్ క్లీన్‌స్వీప్
బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. మిర్పూర్లో జరిగిన రెండో టెస్ట్‌లో మూడు వికెట్ల తేడాతో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని ఏడు వికెట్లు కోల్పోయి చేధించింది.
- 'దానవీర శూరకర్ణ'లో NTR మూడు పాత్రలు చేస్తే.. నేను ఐదు పాత్రలు చేశా: చలపతిరావు
సీనియర్ నటుడు చలపతిరావు హఠాన్మరణంతో చిత్రసీమలో విషాదఛాయలు నెలకొన్నాయి. సహాయనటుడు, ప్రతినాయకుడిగా ఎన్నో ఏళ్లపాటు సేవలు అందించిన చలపతిరావు గతంలో ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్నారు. తన సినీ కెరీర్ ఎలా ప్రారంభమైంది? ఎన్టీఆర్‌తో తనకు ఉన్న అనుబంధం? వంటి విషయాలను ఆయన పంచుకున్నారు.