వ్యవసాయానికి 9 గంటల విద్యుత్తు ఇచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు ఆంధ్రప్రదేశ్ దక్షణ ప్రాంత విద్యుత్తు పంపిణీ లిమిటెడ్ (ఏపీఎస్పీడీసీఎల్) ఛైర్మన్, ఎండి. హరినాథ రావు తెలిపారు. అందుకోసం రూ.450 కోట్లతో పనులు చేపట్టామని... 70 శాతం పనులు పూర్తి చేశామని ఆయన తెలిపారు.
సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ, విద్యుత్తు సరఫరా తదితరాలపై ఎప్పటికపుడు నిర్ణయాలు తీసుకుంటామని ఆయన అన్నారు. విద్యుత్ బకాయిల వసూళ్లకు తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కర్నూలు జిల్లా నంద్యాల విద్యుత్ శాఖ ఈఈ కార్యాలయంలో ఇంజినీర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు.
ఇదీ చదవండి: